Daniel Christian smashes Shakib Al Hasan for five sixes in an over
#Banvsaus
#DanielChristian
#ShakibAlHasan
#Rcb

తన వల్లే సిరీస్ ఓడిపోయామనే బాధో లేక ధాటిగా ఆడాలనే కసో తెలియదు కానీ ఆస్ట్రేలియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్ట్రియన్ ఉగ్రరూపం దాల్చాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్, బెస్ట్ టీ20 బౌలర్ అయిన షకీబ్ అల్ హసన్‌ను చీల్చి చెండాడాడు. 6 బంతుల్లో 5 సిక్సర్లు బాది బంగ్లాదేశ్ ఆటగాళ్లను వణికించాడు. షకీబ్ అదృష్టం కొద్ది ఆ ఒక్క బంతి మిస్సయింది గానీ లేకుంటే ఈ ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ చరిత్రకెక్కేవాడు. 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన యువరాజ్ సింగ్, హెర్షెల్ గిబ్స్, కీరన్ పొలార్డ్, సోబెర్స్ సరసన నిలిచేవాడు. కానీ షకీబ్ రాత బాగుండి అది సాధ్యం కాలేదు. కానీ ఆస్ట్రేలియా మాత్రం అద్భుత విజయాన్నందుకుంది